తీరని గర్భ శోకం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

Update: 2024-09-01 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడ్డారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. కొద్దిసేపటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. స్థానికులు గమనించకపోవడంతో ముక్కు పచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులు ఇక లేరని గుండెలు బాదుకుంటున్నారు. తల్లిదండ్రుల గర్భ శోకం చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. 


Similar News