Kakinada Ship:షిప్‌లో మల్టీ డిసిప్లినరీ టీమ్ తనిఖీలు.. నిజానిజాలను తేల్చనున్న బృందం

రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా పై కూటమి ప్రభుత్వం(AP Government) దృష్టి సారించింది.

Update: 2024-12-04 08:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా పై కూటమి ప్రభుత్వం(AP Government) దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కాకినాడ పోర్టు(Kakinada Port)ను సందర్శించి రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం తరలిస్తున్న స్టెల్లా షిప్ ను కాకినాడ పోర్టులో 'సీజ్ ద షిప్' అంటూ ఆయన అడ్డుకున్న సంగతి తెలిసిందే.

అయితే.. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ సీజ్ చేయించిన షిప్‌లో నేడు(బుధవారం) మరోసారి తనీఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లినరీ కమిటీ(Multi Disciplinary Committee) సముద్రంలోకి బయలుదేరగా, రేషన్ బియ్యం నమునాలు తీసుకోనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. బియ్యం నమూనాలను సేకరించి నిజానిజాలను ఈ టీమ్ నిగ్గు తేల్చనుంది. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్‌కు అందించనుంది.

Tags:    

Similar News