రైతు చట్టాలు మళ్లీ తీసుకువస్తాం.. కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను గత ఏడాది తీసుకొచ్చి.. రైతుల అలుపెరుగని పోరాటంతో వెనక్కి తగ్గి సాగు చట్టాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయంతో ఢిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించి అన్నదాతలు ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. స్వల్ప మార్పులతో తిరిగి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొస్తామని తోమర్ […]
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను గత ఏడాది తీసుకొచ్చి.. రైతుల అలుపెరుగని పోరాటంతో వెనక్కి తగ్గి సాగు చట్టాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం నిర్ణయంతో ఢిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించి అన్నదాతలు ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
స్వల్ప మార్పులతో తిరిగి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొస్తామని తోమర్ తెలిపారు. దీంతో ఈ చట్టాల చర్య మరోసారి సంచలనంగా మారింది. అయితే, మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన తోమర్.. మూడు వ్యవసాయ చట్టాలపై కామెంట్స్ చేశారు. రైతుల మేలు కోసమే ఓ అడుగు ముందుకు వేసి చట్టాలను వెనక్కి తీసుకున్నామని, భవిష్యత్తులో స్వల్ప మార్పులతో తిరిగి చట్టాలను తీసుకొస్తామని వెల్లడించారు. దీంతో, తోమర్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Will farm laws make a come-back??? Union agri minister Narendra Tomar @nstomar drops hint during the inauguration of Agro Vision Expo in Nagpur on Friday. @ndtv pic.twitter.com/HDvateXQ6h
— Mohammad Ghazali (@ghazalimohammad) December 25, 2021