కదులుతున్న విమానం ఎక్కుతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్: తాలిబన్ల చేతిలో వశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఆఫ్ఘాన్‌లో చిక్కుకున్న ఆయా దేశాల పౌరులను వెనక్కిరప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే యూఎస్ ఎయిర్‌ఫోర్స్ విమానం కాబుల్‌కు వచ్చింది. అమెరికా పౌరులను ఎక్కించుకొని తిరిగి టేకాఫ్ అయ్యే సమయంలో ఆఫ్ఘాన్ పౌరులు కూడా పరుగులు పెట్టారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది అయితే దాదాపు బస్సులో ఫుట్‌బోడ్ చేసినట్టుగా ఎగురుతున్న విమానానికి వేలాడారు. ఒక్కసారిగా […]

Update: 2021-08-16 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాలిబన్ల చేతిలో వశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఆఫ్ఘాన్‌లో చిక్కుకున్న ఆయా దేశాల పౌరులను వెనక్కిరప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే యూఎస్ ఎయిర్‌ఫోర్స్ విమానం కాబుల్‌కు వచ్చింది. అమెరికా పౌరులను ఎక్కించుకొని తిరిగి టేకాఫ్ అయ్యే సమయంలో ఆఫ్ఘాన్ పౌరులు కూడా పరుగులు పెట్టారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది అయితే దాదాపు బస్సులో ఫుట్‌బోడ్ చేసినట్టుగా ఎగురుతున్న విమానానికి వేలాడారు. ఒక్కసారిగా ఫ్లైట్ ఆకాశంలో ఎగిరిన సమయంలో గాలి వేగానికి తట్టుకోలేక కిందపడిపోయారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరీ ఇంత దారుణమైన పరిస్థితులు ఎదురవడంపై నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడే వారిని కాపాడాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News