నటి జయంతి మృతి విచారకరం : చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: సీనీ నటి జయంతి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అభినయ శారద అనిపించుకున్న జయంతి మృతి విచారకరమన్నారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా జయంతి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘ఆరు భాషల్లో 500 పైగా చిత్రాల్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్‌కుమార్ వంటి ఉద్దండులతో కలిసి నటించి..’అభినయ శారద’ అనిపించుకున్న జయంతిగారి మరణం విచారకరం. జయంతిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ […]

Update: 2021-07-26 05:14 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీనీ నటి జయంతి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అభినయ శారద అనిపించుకున్న జయంతి మృతి విచారకరమన్నారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా జయంతి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘ఆరు భాషల్లో 500 పైగా చిత్రాల్లో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్‌కుమార్ వంటి ఉద్దండులతో కలిసి నటించి..’అభినయ శారద’ అనిపించుకున్న జయంతిగారి మరణం విచారకరం. జయంతిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

ఇకపోతే గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జయంతి ఆదివారం రాత్రి కన్నుమూశారు. 1945 జనవరి 6న బళ్ళారిలో జన్మించిన జయంతి.. కన్నడ సినిమా ‘జెనుగూడు(1963)’తో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

 

Tags:    

Similar News