జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య
దిశ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని శివ వీధిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. శివవీధికి చెందిన గంజి రాంబాబు, లావణ్య దంపతులు ముంబయిలో ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. రాంబాబు తండ్రి రాజేశం 10 నెలల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దంపతులు స్వస్థలానికి చేరుకుని జగిత్యాలలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రింతం ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే గురువారం తమ ఇంట్లో […]
దిశ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని శివ వీధిలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. శివవీధికి చెందిన గంజి రాంబాబు, లావణ్య దంపతులు ముంబయిలో ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. రాంబాబు తండ్రి రాజేశం 10 నెలల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందారు. దీంతో దంపతులు స్వస్థలానికి చేరుకుని జగిత్యాలలోనే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రింతం ఇరువురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే గురువారం తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి వివాహమై 25 ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని కలత చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలువాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.