మూవీ ప్లానెట్​లో భారీ చోరీ

చార్మినార్​ బస్టాండ్​కు ఎదురుగా ఉన్న మూవీ ప్లానెట్​ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు 1.50 లక్షల నగదుతో పాటు సెల్​ఫోన్​లను అపహరించుకు పోయిన ఘటన శనివారం తెల్లవారుజామున చార్మినార్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ​

Update: 2024-06-29 13:25 GMT

దిశ, చార్మినార్​ : చార్మినార్​ బస్టాండ్​కు ఎదురుగా ఉన్న మూవీ ప్లానెట్​ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు 1.50 లక్షల నగదుతో పాటు సెల్​ఫోన్​లను అపహరించుకు పోయిన ఘటన శనివారం తెల్లవారుజామున చార్మినార్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ​ వివరాలలోకి వెళితే... చార్మినార్​ బస్టాండ్​ కు ఎదరుగా గత కొంత కాలంగా మూవీ ప్లానెట్​ పేరుతో ఎలక్ట్రానిక్​ పరికరాలను విక్రయిస్తున్నారు.

    ఎప్పటిలాగానే శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి వెళ్లారు. తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు షెటర్​ తీసి లోనికి ప్రవేశించారు. క్యాష్​ కౌంటర్​లో ఉన్న 1.50 లక్షల నగదుతో పాటు సెల్​ఫోన్​లు అపహరించుకుపోయారు. ఇదంతా సీసీ కెమెరాలో నిక్షిప్తమైనట్లు పోలీసులు గుర్తించారు. మువీ ప్లానెట్​ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు చార్మినార్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News