పాడేరులో అమ్మవారి విగ్రహం ధ్వంసం

by srinivas |
పాడేరులో అమ్మవారి విగ్రహం ధ్వంసం
X

దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే… తాజాగా శుక్రవారం విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం అమ్మవారి పాదాలను దుండగులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘం నాయకలు శ్రీరామ్‌ మాట్లాడుతూ తరుచుగా విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల తరుపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed