ఆ ‘చెట్టు’తో అమితాబ్‌కు 43 ఏళ్ల అనుబంధం

by Jakkula Samataha |
ఆ ‘చెట్టు’తో అమితాబ్‌కు 43 ఏళ్ల అనుబంధం
X

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో జల్సా, ప్రతీక్ష, జనక్ అనే మూడు ఇళ్లున్న విషయం తెలిసిందే. వీటిలో జల్సా, ప్రతీక్ష రెండింట్లోనూ నివాసముంటుండగా.. జనక్‌ను మాత్రం ఫ్యామిలీ ఫిట్‌నెస్ సెంటర్‌గా మార్చేశారు. ఇక ప్రతీక్ష అమితాబ్ కొనుక్కున్న మొట్టమొదటి ఇల్లు కాగా, ఆ ఇంటికి ఆ పేరెలా వచ్చిందో అమితాబ్ తాజాగా వివరించారు. అంతేకాదు.. అందులోని ఓ చెట్టు ఇటీవల కురిసిన వర్షాలకు పడిపోయింది. దీంతో ఆ చెట్టుతో ఉన్న బంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తన అభిమానులతో ఆ జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు.

అమితాబ్‌కు ప్రతీక్ష బంగ్లా అంటే ఎంతో ఇష్టం. అందుకే అందులోని కొన్ని గదులను తన తల్లిదండ్రుల ఙ్ఞాపకార్థం వాడకుండా ఉంచేశారు. అయితే తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప కవిగా పేరుపొందిన విషయం తెలిసిందే. ఆ విషయాలను లేటెస్ట్ బ్లాగులో పంచుకున్నారు. ‘1976లో తొలిసారిగా నేను ఓ ఇల్లు కొనుకున్నాను. ఈ జనరేషన్‌‌కు ఎప్పటికీ కొనడానికి సాధ్యం కానటువంటి ఇల్లు నా సొంతమైంది. లాన్‌లో ఓ మొక్క పెట్టాను. ఆ ఇంటికి అమ్మనాన్నలను ఆహ్వానించాను. అప్పుడు వాళ్లు.. ఈ బంగ్లాకు ప్రతీక్ష అని పేరు పెట్టారు. అది నాన్న రాసిన కవితలోని ఓ లైన్ నుంచి తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ‘ఈ ఇంట్లోకి రావడానికి అందరికీ ఆహ్వానం ఉంటుంది. కానీ మేము ఎవరి కోసం వేచి చూడం (స్వాగత్ సబ్కే లియే యహా పర్, నహి కిసి కే లియే ప్రతీక్ష)’ అనేవే ఆ కవితా పంక్తులు.

చెట్టంతా జ్ఞాపకాలు :

‘‘ప్రతీక్ష‌లో ఉన్న గుల్‌మోహర్ చెట్టుతో ఎన్నో జ్ఞాపకాలు పెనవేసుకుని ఉన్నాయి. పిల్లలంతా ఆ చెట్టు పరిసరాల్లోనే పెరిగారు. మనవలు, మనవరాళ్లు కూడా ఆ చెట్టు చుట్టే ఆడుకున్నారు. వాళ్ల బర్త్ డేలు అక్కడే జరిగాయి. ఆ చెట్టు పైనే దీపావళి కాంతులు వెలిగేవి. ప్రతి సంవత్సరం హోళికి ముందు వచ్చే హోలిక దహనం అక్కడే జరిగేది. సత్య నారాయణ పూజ ఆ చెట్టు దగ్గరే జరిపించేవాళ్లం. అమ్మనాన్నల ఎన్నో జ్ఞాపకాలకు ఆ చెట్టే సాక్ష్యం. అక్కడ ప్రార్థనలు చేసే వాళ్లం. వేసవిలో ఆరెంజ్ పూలతో ఎంతో అందంగా ఉండేది. అభిషేక్, ఐశ్యర్యల వివాహం కూడా ఆ చెట్టు పరిసరాల్లోనే జరిగింది. 43 సంవత్సరాలుగా ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ఆ చెట్టు.. ఇటీవల నేలకొరిగింది’ అని అమితాబ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed