ఢిల్లీ పోలీసులకు అమిత్ షా పరామర్శ..

by Shamantha N |   ( Updated:2021-01-28 04:31:26.0  )
ఢిల్లీ పోలీసులకు అమిత్ షా పరామర్శ..
X

దిశ, వెబ్‌డెస్క్ : రిపబ్లిక్ డే సందర్భంగా దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రైతులను అదుపు చేసేందుకు యత్నించి సుమారు 200లకు పైగా పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గాయపడిన పోలీసులను గురువారం పరామర్శించారు.

కాగా, రైతు ర్యాలీలో భాగంగా విధ్వంసానికి తెరలేపిన కిసాన్ సంఘాల నాయకులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.పరారీలో ఉన్నవారికోసం లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story