కేబీసీ-12తో మీ ముందుకు వస్తున్నాను : అమితాబ్

by Shyam |
కేబీసీ-12తో మీ ముందుకు వస్తున్నాను : అమితాబ్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ హోస్ట్ గా బుల్లితెర క్విజ్ షో “కౌన్ బనేగా కరోడ్ పతి” ఎంతటి సంచలనం కలిగించిందో అందరకి తెలిసే ఉంటుంది. తాజాగా ఈ షోకు సంబంధించి KBC 12 త్వరలో మొదలు కాబోతున్నట్లు అమితాబచ్చన్ ప్రకటించాడు. ఈ షో స్ఫూర్తితో వివిధ భాషల్లో పలు క్విజ్ కార్యక్రమాలు వచ్చాయి. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కూడా ఆ జాబితాలోనే నిలుస్తుంది. కౌన్ బనేగా కరోడ్ పతి ..ఇప్ప‌టికే 11 సీజ‌న్లు పూర్తి చేసుకొని 12వ సీజ‌న్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైంది.

‘ఇతరులతో చాయ్, ఆ చాయ్ ముగించేలోపు సాగించే సంభాషణలు, రోడ్డుపై షికార్లు, బోరింగ్ 9-5 జాబ్, అర్ధరాత్రుళ్లలో చక్కర్లు కొట్టడం, మాల్ లో రోమాన్స్ చేయడం… ఇలా మ‌న జీవితంలో ప్ర‌తి దానికి ఒక బ్రేక్ ఉంటుంది. కాని క‌ల‌ల‌కి కాదు. మీ క‌ల‌ల‌కి రెక్క‌లు అందించేందుకు కేబీసీ 12తో బుల్లితెర‌పై మీ ముందుకు వస్తున్నాను’ అని అమితాబ్ పేర్కొన్నారు . ఇంకెందుకు ఆల‌స్యం మే 9 న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేష‌న్‌లో మీ పేరు రిజిస్ట్రేష‌న్ చేసుకోండి అని అమితాబ్ వీడియో ద్వారా తెలిపారు. అతి త్వ‌ర‌లోనే ఈ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది. సోనీ కూడా తన ట్విట్టర్ లో ఈ పోస్ట్ ను షేర్ చేసింది.

tags: amitabh bachchan, kbc, sony tv, registration

Advertisement

Next Story