- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పీపీఈ నీలి సముద్రంలో బిగ్ బీ
దిశ, వెబ్‌డెస్క్: తన నటన, వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఏ చిన్న పని చేసినా అందులో తన మార్క్ కనబడేలా చేస్తారు. ఇక ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులు, అభిమానులతో ఎంత గొప్ప అనుబంధాన్ని పంచుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడో సీజన్ తప్ప అన్ని సీజన్లకు తానే హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బీ.. బుల్లి తెరపై తనదైన ముద్ర వేశారు. ఈ కార్యక్రమంతో 20 ఏళ్ల అనుబంధం కలిగి ఉన్న బచ్చన్ సాబ్.. తాజాగా సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి షూటింగ్‌లో పాల్గొంటున్న అమితాబ్.. పీపీఈ కిట్ల నీలి సముద్రంలో షూటింగ్ జరుగుతోందని తెలిపాడు. కేబీసీ(KBC) 12వ సీజన్ షూటింగ్‌కు హాజరైన ఆయన.. ఇది 20 ఏళ్ల జీవిత కాల ప్రయాణమని తెలిపారు. సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేసిన బచ్చన్ జీ.. ఇది లోతైన శాస్త్రీయ ప్రయోగాలు చేసే ప్రయోగశాలగా కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం సెట్‌లో పనికి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నారని.. లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటున్నారని చెప్పాడు. తెలిసిన మొహాలు కూడా గుర్తుపట్టలేకున్నామని.. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు బిగ్ బీ. అసలు మనం సరైన స్థలంలో ఉన్నామా? సరైన వ్యక్తులతో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందని అన్నారు. కానీ ప్రతీది చాలా జాగ్రత్తగా జరుగుతోందని.. అన్ని నిబంధనలు అనుసరిస్తూ షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు. కష్ట సమయాల్లో ఇలాంటి జాగ్రత్తలు తప్పవని.. త్వరలో సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశిద్దాం అన్నారు.