కరోనాపై బచ్చన్ కవిత

by Shyam |   ( Updated:2020-03-13 05:24:06.0  )
కరోనాపై బచ్చన్ కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ దేశాలన్నీ అప్రమత్తం అవుతున్నాయి. ప్రభుత్వాలన్నీ ప్రజలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ విషయాలనే మీడియాలోనూ ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హీరో విజయ్ దేవరకొండతో ఓ వీడియో రిలీజ్ చేసి కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ఒకవేళ వైరస్ లక్షణాలు బయటపడితే ఏం చేయాలనే దానిపై వీడియోలో వివరించాడు విజయ్.

ఇదిలా ఉంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గురించి సలహాలు ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన బచ్చన్… యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నేతృత్వంలో త్వరలో రిలీజ్ చేయబోతున్న యాడ్ షూటింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వీడియో విడుదల అవుతుందన్నారు. అంతేకాదు బచ్చన్ కరోనాపై కవిత కూడా రాశారు. కవిత చదువుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇది కాస్తా నెటిజన్లను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags: CoronaVirus, Amitab Bachan, Vijay Devarakonda, Covid 19, Precautions

Advertisement

Next Story