ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే.. గెలిచేది మేమే: అమిత్ షా

by Anukaran |   ( Updated:2021-09-17 06:00:46.0  )
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే.. గెలిచేది మేమే: అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతోందని.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని గుర్తు చేశారు.

అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్‌ డిమాండ్ చేశారని.. ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. సర్దార్ పటేల్ సైనిక చర్యతోనే తెలంగాణకు విమోచనం లభించిందని గుర్తు చేశారు. మజ్లిస్ పార్టీకి బీజేపీ బయపడదని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల్లో ఆలోచన మొదలైందని.. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 119 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రసంగం చివరలో హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ని ముందుకు పిలిచి చప్పట్లతో ప్రజల మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed