- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ సైట్‌కు అమిత్ షా
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్ పరిస్థితులను పరిశీలించడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రానికి ప్రయాణమవుతున్నారు. సుక్మా-బీజాపూర్ సరిహద్దులో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఆయన స్వయంగా వెళ్లనున్నారు. కాల్పుల్లో గాయపడ్డ జవాన్లను హాస్పిటల్ వెళ్లి పరామర్శించనున్నారు. శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మరణించగా కనీసం 30మందికి పైగా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ తర్వాతి పరిస్థితులను పర్యవేక్షిస్తు్న్న సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ ఇంటెలిజెన్స్ వైఫల్యమన్న వాదనలను ఆదివారం కొట్టిపారేశారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ జవాన్ల బలిదానాలను ఊరికే వదిలిపెట్టబోమని, తగిన గుణపాఠమిస్తామని వివరించారు. మావోయిస్టులపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, వారిని తుదముట్టించే వరకు చేపడతామని స్పష్టం చేశారు.