- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెంగాల్‌లో క్యాంపెయిన్‌కు అమిత్ షా శ్రీకారం..!
by Shamantha N |
X
కోల్‌కతా : నార్త్ ఢిల్లీ ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు పశ్చిమ బెంగాల్ పర్యటించి ఎన్నికల క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కోల్‌కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్స్‌లో ఈ ఎన్నికల ప్రచారాన్ని షా ప్రారంభించనున్నారు. తృణమూల్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ‘అన్యాయాన్ని ఇక సహించేది లేదు’ అనే పాటతో ఈ ఎన్నికల ప్రచారం సాగనున్నట్టు తెలిసింది. నేడు నిర్వహించనున్న ర్యాలీలో ఢిల్లీ అల్లర్ల గురించి అమిత్ షా ఏం మాట్లాడనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల నుంచే పార్టీ బలం పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
Advertisement
Next Story