- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటలకు అమిత్ షా దిశానిర్దేశం.. ఆ కుంభంకోణం బయటపెట్టాలంటూ..
దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతి తదితర నాయకులతో పాటు ఈటలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రధానంగా బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టండని సూచించినట్లు తెలిసింది. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మీరు చేయాల్సింది మీరు చేయండని, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో మాకు వదిలేయండన్నట్లు సమాచారం. కేంద్రం మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని, ఇకపై తెలంగాణలో తరచూ పర్యటిస్తా అని అమిత్ షా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా ఈటలను ప్రత్యేకంగా అభినందించారు. బీజేపీలో చేరిన వాళ్లంతా మనవాళ్లే అని ప్రకటించారు. తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా చేరికలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆహ్వానితులందిరికీ ఆదేశించారు.