- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమిత్ పంగల్ అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్
దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ నెంబర్ వన్ బాక్సర్ అమిత్ పంగల్ జాతీయ శిబిరానికి తనతో పాటు వ్యక్తిగత కోచ్‌ను అనుమతించాలని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI)కు అభ్యర్థన పెట్టిన చాలా రోజుల తర్వాత గ్రీన్ సిగ్నల్ లభించింది. తన కోచ్ అనిల్ ధన్‌కర్‌ను జాతీయ శిబిరంలోకి అనుమతించాలని గత కొన్నాళ్లుగా అమిత్ కోరుతున్నాడు. దీంతో ఎట్టకేలకు బీఎఫ్ఐ అతడి అభ్యర్థనకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఇటలీలో ఉన్న అమిత్ పంగల్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు.
‘బీఎఫ్ఐ తన అభ్యర్థనను అంగీకరించడానికి తొలుత సంశయించింది. మేరీ కోమ్ వంటి వారి వ్యక్తిగత కోచ్‌లను అనుమతించి.. నా కోచ్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ప్రశ్నించాను. అయితే కరోనా కారణంగా నా అభ్యర్థన అంగీకరించడానికి సమయం పట్టింది. కానీ చివరకు అనిల్‌ను తీసుకెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జనవరి 2021 నుంచి ఒలంపిక్స్ ముగిసే వరకు అతడు నాతోనే ఉంటాడు. ఇండియాలో అతడి పర్యవేక్షణలో శిక్షణ తీసుకోవడం ఆనందంగా ఉన్నది’ అని అమిత్ చెప్పాడు. జాతీయ శిబిరంలో ఆటగాళ్ల భాగస్వాములను తీసుకెళ్లే వీలు లేకపోవడంతో.. బాక్సింగ్ టీమ్ తమ కుటుంబాలతో ఇటలీలో పర్యటిస్తున్నారు.