- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా యువతి అది నేర్పించమంది.. క్యూ కట్టిన నెటిజన్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాలలో తెలుగు భాషకు ఉన్న ఖ్యాతి అంతా ఇంతా కాదు. అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాలవారు సెటిల్ అవడంతో.. అందరికీ పరిచయమున్న భాషగా తెలుగు పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అయితే అమెరికాలో ఉండే బ్రీ అనే యువతి కూడా తెలుగు నేర్చుకుంది. ఆమె తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం అన్నీ నేర్చుకున్నారు. తాజాగా తెలుగు పాటలు కూడా పడటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఓ పాట నేర్పించాలంటూ.. ఆమె చేసిన ట్వీట్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది.
ఇంతకీ ఆ పాట ఏంటంటే..
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు.. భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు.. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము.. ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు.. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు.. ఆంధ్రులమైన మన భాషకు అన్యాయం చేస్తున్నాము అంటూ లిరిక్స్‌తో కూడిన ఓ పాటకు ట్యూన్ చెప్పండి అంటూ బ్రీ రిక్వెస్ట్ చేసింది.
https://twitter.com/BreTelugu/status/1436917025868324865?s=20
బ్రీ ట్వీట్..
‘ఈ పాట నాకు చాలా ఇష్టం. 🎶❤️🇮🇳 పాట అర్థం చాలా బాగుంది. 😊 నేను ఈ పాట నేర్చుకోవాలనుకుంటున్నాను. 🎤🎵 తెలుగు పాటలు అమెరికన్ పాటలతో పోలిస్తే భిన్నంగా ఉండటం వలన నాకు పాడటం కష్టంగా ఉంది. 🇺🇸🙈 మీలో ఎవరైనా నాకు ఈ పాటను ఎలా పాడాలో నేర్పించగలరండి? 🙏’ అంటూ నెటిజన్లను కోరింది. ఈ ట్వీట్‌కు స్పందించిన తెలుగు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ.. పాట నేర్పించేందుకు క్యూ కట్టారు. మీరు కూడా నేర్పించాలనుకుంటే ” బ్రీ తెలుగు” ట్విట్టర్ అకౌంట్‌లో స్పందించండి.