- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు ప్రాణభయం ఉంది : అమీషా పటేల్
దిశ, వెబ్‌డెస్క్ :
‘బద్రి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్‌ను అత్యాచారం చేసి హత్య చేస్తామని బెదిరించినట్టు బిహార్‌కు చెందిన నాయకుడిపై ఆరోపణలు చేసింది. బిహార్‌కు వెళ్తే ఘనస్వాగతం లభిస్తుందనుకున్న తనకు ఇలాంటి పరాభావం ఎదురైందని వాపోయింది. అసలు విషయం ఏంటంటే.. ఎల్‌జేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరపున ప్రచారం చేసేందుకు అమీషా స్టార్ క్యాంపెయినర్‌గా బిహార్ వెళ్లింది. కానీ అక్కడ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చూశానని, ప్రకాష్ చంద్ర వల్ల తనకు ప్రాణభయం ఉందని చెప్పింది. అసలు ప్రకాష్ చంద్ర గురించి తనకేమీ తెలియదని, తన గురించి చాలా గొప్పగా చెప్పాలని ఒత్తిడి చేశారని తెలిపింది. లేదంటే చంపేస్తామని బెదిరించారన్న అమీషా.. తన ప్రెజెన్స్‌ను మిస్ యూజ్ చేశారని తెలిపింది.
అయితే, అలాంటిదేమీ లేదని అమీషా పటేల్ ఆరోపణలను ఖండించారు ప్రకాష్ చంద్ర. ప్రచారం చేసేందుకు తన బంధువు పప్పు యాదవ్ ద్వారా రూ. 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. పైగా తనకు సెక్యూరిటీ కల్పించామని, తను చెప్పేదంతా అబద్ధమని వెల్లడించారు.