అంబులెన్స్‎లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!

by Shyam |   ( Updated:2020-10-03 01:40:32.0  )
అంబులెన్స్‎లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!
X

దిశ, వెబ్‎డెస్క్: మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా శనివారం మరో 21 అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు ప్రజాప్రతినిధులు. ఈ అంబులెన్సులను ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి ఎంపీలు శ్రీనివాస్ రెడ్డి, రంజింత్ రెడ్డిలు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీలు శ్రీనివాస్ రెడ్డి, రంజిత్ రెడ్డి మూడు అంబులెన్స్‌ల చొప్పున, మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేందర్, ఆరూరీ ర‌మేశ్, ఉపేందర్ రెడ్డి, విన‌య్ భాస్క‌ర్, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, వరంగ‌ల్‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్ రావు ఒక్కొ అంబులెన్స్ చొప్పున అంబులెన్సులను అంద‌జేశారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ అంబులెన్సులు సేవలు అందించనున్నాయి.

Advertisement

Next Story