- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ విగ్రహాన్ని కిడ్నాప్ చేసి జైల్లో పెట్టారు: వీహెచ్
దిశ, అంబర్ పేట్: హనుమంతరావు అనారోగ్యాన్ని అధిగమించడం అభినందనీయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాగ్ అంబర్ పేట్‌లోని వీహెచ్ నివాసంలో ఆయనను కిషన్ రెడ్డి పరామర్శించారు. వీహెచ్ యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ చే నెంబర్ చౌరస్తాలో నిర్మించనున్న జ్యోతిరావు పూలే ఆడిటోరియం నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అనేక ప్రాంతాల్లో విగ్రహాలు పెట్టడం జరుగుతుందని, అంబేద్కర్ విగ్రహాన్ని పంజాగుట్టలో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దళితుల ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. దాదాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కిడ్నాప్ చేసి మూడేళ్లుగా జైల్లో పెట్టించిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. గతంలో తలపెట్టిన జ్యోతిరావు పూలే ఆడిటోరియాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ హర్షవర్ధన్ పాల్గొన్నారు.