- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి తాగుబోతులకు.. కొడుకు డ్రగ్స్ తీసుకునేవాళ్లకు అంబాసిడర్లు
దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఇస్తే 12 శాతం ఇస్తా అని కేసీఆర్ చెప్పి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన కింద నిధులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తే దానిని పక్కన పెట్టి లక్ష కోట్లు పక్కదారి పట్టించిండు. కుటుంబాలు చిదిమడానికి, కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడానికి తాగుడం వల్లకాదా అని అన్నారు. రూ.36 వేల కోట్లు తీసుకుంటున్న తాగుబోతు, నీచుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదా ఆలోచించండి. 3.5 కోట్లు ఉన్న జనాభా 4 కోట్లు అయ్యింది కానీ తాగుబోతులను 3 రేట్లు పెంచిండు. సినిమా వాళ్లతో తిరిగిన కేటీఆర్ ఈడీ కేసులో తప్పించేందుకు ప్రయత్నిస్తుండు. తండ్రి తాగుబోతులకు.. కొడుకు డ్రగ్ తీసుకునేవాళ్లకు అంబాసిడర్ గా మారారు. వ్యాపారం కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని ప్రశ్నించారు. 9,10 తరగుతుల పిల్లలు గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు ఓ సారి ఆలోచించు కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
బూత్ కు 9 మంది చొప్పున నడుము బిగించి తుది దశ తెలంగాణ కోసం తరలిరండి. రాబోయే 19 నెలలు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయించబోతోంది. ప్రపంచంలోనే రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రాణాలర్పించైనా సరే కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది. 34708 బూత్ లో 9మంది చొప్పున 19 నెలలు తుది దశ తెలంగాణ కోసం పోరాడతారో వారిని గుర్తించి గుండెల్లో పెట్టుకుంటాం. అప్పుడు మీరే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారు. తాతలు, ముత్తాతలు కొట్లాడి భూమి , భుక్తి, విముక్తి కోసం పోరాడి సాధించుకుంటే రెండు సార్లు దుర్మార్గుడి చేతులో పెడుతే రాష్ట్రం అదోగతి పాలైంది.