నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న అమెజాన్

by Harish |
నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న అమెజాన్
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న పండుగ సీజన్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (E-commerce giant Amazon) పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నెట్‌వర్క్ విస్తరణ (Network expansion) కోసం కొత్తగా కేంద్రాలను ప్రారంభించింది. దీని ద్వారా పండుగ సీజన్ (Festive season) సమయానికి కస్టమర్లకు, అమ్మకం దారులకు వీలైనంత వేగంగా డెలివరీలను అందించాలని, కనెక్టివిటీని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నట్టు అమెజాన్ ఇండియా (Amazon India) మంగళవారం ప్రకటించింది.

ప్రస్తుతం ఉన్న 8 సార్టింగ్ వేర్‌హౌస్‌ (8 Sorting Warehouse)లను విస్తరించి, కొత్త వేర్‌హౌస్‌లను ప్రారంభించనున్నట్టు అమెజాన్ వెల్లడించింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియా 19 రాష్ట్రాల్లో మొత్తం 2.2 మిలియన్ చదరపు అడుగుల సార్టింగ్ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ సార్టింగ్ కేంద్రాల ద్వారా అమెజాన్ డెలివరీ ప్యాకేజీలను సమీకరించేందుకు ఉపయోగపడతాయని, స్థానికంగా డెలివరీ స్టెషన్ల నుంచి కస్టమర్లకు చేరుతాయని కంపెనీ పేర్కొంది. ఈ విస్తరణ వ్యక్తులు, సహాయక పరిశ్రమలకు అవకాశాలను సృష్టిస్తుందని అమెజాన్ ఇండియా రవాణా సేవల డైరెక్టర్ అభినవ్ సింగ్ వెల్లడించారు. ఇటీవల అమెజాన్ ఇండియా పూర్తిస్థాయి నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉన్న 5 భవనాలతో పాటు కొత్త మరో 10 సెంటర్లను పూర్తిస్థాయి నెట్‌వర్క్ విస్తరణ (Network expansion) జరపనున్నట్టు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed