ప్రైమ్ మెంబర్స్‌కి దిమ్మదిరిగే షాక్ ఇవ్వనున్న అమెజాన్..

by Harish |
prime video
X

దిశ, ఫీచర్స్:పెట్రోల్, గ్యాస్, మొబైల్ చార్జీలతో పాటు కూరగాయల రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇదే క్రమంలో మరికొన్ని రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ఇయర్లీ ప్యాకేజ్ ధరలు కూడా పెరగనున్నాయి. అమెజాన్ కంపెనీ తన FAQ పేజీలో ఈ వార్తలను ధృవీకరించింది. ప్రస్తుతం రూ. 999/-కు అందుబాటులో గల ప్రైమ్ యాన్యువల్ మెంబర్‌షిప్ ధరను డిసెంబర్ 13 నుంచి భారీగా పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ-కామర్స్ దిగ్గజం తెలిపిన వివరాల ప్రకారం.. Amazon Prime నెలవారీ చందా త్వరలోనే రూ. 179 అవుతుండగా, వార్షిక సభ్యత్వానికి రూ. 1,499 చెల్లించాల్సి ఉంటుంది. అంటే వార్షిక ప్లాన్‌కు రూ. 500 పెరుగుతున్నట్లు లెక్క. ఇక క్వార్టర్లీ ప్లాన్ విషయానికొస్తే రూ. 459/-కు పెంచనుంది.

ప్రస్తుత ప్రైమ్ మెంబర్స్ తమ మెంబర్‌షిప్ ప్లాన్ ముగిసేంత వరకు పాత సభ్యత్వాన్ని కొనసాగించవచ్చు. ఇండియాలో 2016లో లాంచ్ అయినప్పటి నుంచి క్వాలిటీ సర్వీస్ అందిస్తూనే ఉన్నాం. ప్రైమ్ కస్టమర్స్ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా, వినోదభరితంగా మార్చడానికి షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కంబైన్డ్ సర్వీస్‌తో సేవింగ్ స్కీమ్స్ అందిస్తున్నాం. వినియోగదారుల కోసం ప్రైమ్‌ను మరింత విలువైందిగా మార్చేందుకు పెట్టుబడులను కొనసాగిస్తున్నాం. ఈ కారణంగానే కంపెనీ.. సబ్‌స్క్రిప్షన్ ధరను పెంచాలని కోరుకుంటోంది.
– అమెజాన్ ఇండియా

Advertisement

Next Story

Most Viewed