క్యాషియర్ లేని స్టోర్‌ని ప్రారంభించిన అమెజాన్

by Harish |
క్యాషియర్ లేని స్టోర్‌ని ప్రారంభించిన అమెజాన్
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఇప్పటికే దాదాపు అన్నింట్లో అడుగుపెట్టిన అమెజాన్, ఇప్పుడు సూపర్ మార్కెట్ బిజినెస్ మీద కూడా కన్నేసింది. తమ టెక్నాలజీతో క్యాషియర్ లేని స్టోర్‌‌ని తెరిచి 800 బిలియన్ డాలర్ల సరుకుల పరిశ్రమను దెబ్బతీయబోతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా మంగళవారం రోజున అమెరికాలో సియాటెల్‌లో క్యాషియర్ లెస్ స్టోర్‌ని ప్రారంభించింది.

ఇందులో షాపింగ్ చేయడానికి సాయం చేసే వాళ్లు గానీ, ప్యాక్ చేసే వాళ్లు గానీ, క్యాషియర్ గానీ ఉండరు. కేవలం బయట అమెజాన్ గో Amazon, Amazon Go, Amazon go grocery, Cashier less grocery, Walmart, Seattleయాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి స్టోర్‌లో ప్రవేశించాలి. తర్వాత కావాల్సినవన్నీ ఏరుకుని బయటికి వచ్చేయాలి. పూర్తిగా కెమెరాలతో నిండి ఉన్న ఈ స్టోర్‌లో మీరు ఏయే వస్తువు తీసుకున్నారో గుర్తించి అందుకు సరిపడ డబ్బును అమెజాన్ ఖాతా నుంచి తర్వాత కట్ చేస్తారు. దీనికి అమెజాన్ గో గ్రోసరీ అని పేరు పెట్టారు.

చిన్న సైజు స్టోర్లతో పోల్చితే ఇది ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సోడాలు, శాండ్‌విచ్‌ల నుంచి మొదలు పెడితే మాంసం, కూరగాయలు, పండ్ల వరకు లభిస్తాయి. గతంలో హోల్ ఫుడ్స్ పేరుతో అమెజాన్ గ్రోసరీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ ఆఫ్‌లైన్‌లో ఇంత పెద్ద స్టోర్ పెట్టడం ప్రథమం. ఇలాంటి స్టోర్లు ఇంకొన్ని తెరిస్తే వాల్‌మార్ట్‌కి గట్టిపోటీగా మారడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక కొత్త క్యాషియర్ లెస్ స్టోర్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నవారు కూడా లేకపోలేదు. ఈ స్టోర్ ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్లే తీసుకోవాలి. వేరే వారికి సాయం చేసే ప్రయత్నంలో ఒకరు తీసుకోబోయే వస్తువును వేరొకరు ముట్టుకుంటే.. ఆ బిల్లు ముట్టుకున్న వారి ఖాతా నుంచే తొలగించే విధానం బాలేదని అంటున్నారు. అంతేకాకుండా సాయం చేసే వారు, ప్యాక్ చేసే వారు లేకపోవడం షాపింగ్ అనుభవాన్ని కలిగించడం లేదని పెదవి విరుస్తున్నారు.

Advertisement

Next Story