- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో విస్తరణ కోసం అమెజాన్ భారీ పెట్టుబడులు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా దేశీయంగా తన స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 40 శాతం వరకు విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా అమెజాన్ ఇండియా 11 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ప్రారంభిస్తుందని, ఇప్పుడున్న 9 ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపింది. వీటి కోసం కంపెనీ భారత్‌లో భారీగా పెట్టుబడులకు సిద్ధమవుతోంది. దీనివల్ల భారత్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతేకాకుండా ఈ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల విస్తరణ ద్వారా దాదాపు 8.5 లక్షల మంది అమ్మకందారులకు మద్దతుగా నిలుస్తుందని కంపెనీ వివరించింది. ‘అమెజాన్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం ద్వారా దేశంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వినియోగదారులకు సేవలు అందించడంతో పాటు తగిన సామర్థ్యాన్ని అందించనున్నాం. అదేవిధంగా, వినియోగదారులకు విస్తృతమైన ఎంపిక, వేగవంతమైన డెలివరీలను అందజేయగలం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్ సహా ఇతర రాష్ట్రాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను విస్తరిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.