- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'అత్యంత ప్రయోజనం' కలిగిన బ్రాండ్‌లుగా అమెజాన్, ఏషియన్ పెయింట్..
దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటూ ఏషియన్ పెయింట్, టాటా టీ సంస్థలు ఈ ఏడాది టెక్, ఎఫ్ఎంసీజీయేతర, ఎఫ్ఎంసీజీ విభాగాల్లో ‘అత్యంత ప్రయోజనం’ కలిగిన బ్రాండ్‌లుగా నిలిచాయి. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ కాంటార్ రూపొందించిన ‘బ్రాండ్‌జెడ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. టెక్నాలజీ విభాగంలో అమెజాన్ తర్వాత ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో, యూట్యూబ్, స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ విభాగంలో టాటా టీ తర్వాతి స్థానాల్లో సర్ఫ్ ఎక్సెల్, తాజ్‌మహల్, మ్యాగీ, పారాచూట్, బ్రిటానియా కంపెనీలు నిలిచాయి. ఎఫ్ఎంసీజీయేతర విభాగంలో ఏషియన్ పెయింట్స్ తర్వాత జియో, శాంసంగ్, ఎఫ్ఆర్ఎఫ్, టాటా హౌసింగ్, ఎయిర్‌టెల్ కంపెనీలున్నాయి.
ఈ జాబితా రూపొందించేందుకు కాంటార్ సంస్థ మొత్తం 418 బ్రాండ్‌లను పరిశీలించింది. అలాగే 30 అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ జాబితా సిద్ధం చేసినట్టు సంస్థ వివరించింది. ఎఫ్ఎంసీజీయేతర బ్రాండ్‌లు ఉత్పత్తి, సేవల పనితీరుకు మించి బ్రాండ్‌ను ప్రోత్సహించే మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించడంపై దృష్టి సారిస్తున్నాయని నివేదిక తెలిపింది. భారతీయ వినియోగదారుల్లో 77 శాతం మంది మెరుగైన ప్రయోజనాలు కలిగి ఉన్న కంపెనీల కోసం సమయంతో పాటు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారని కాంటార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపేందర్ రాణా అన్నారు.