కాంగ్రెస్​కు షాక్​.. బీజేపీలోకి మాజీ సీఎం

by Shyam |
కాంగ్రెస్​కు షాక్​.. బీజేపీలోకి మాజీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరే అవకాశముంది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలవనున్నారు. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో అసంతృప్తిలో ఉన్న ఆయన త్వరలో కాషాయ గూటికి చేరుకోనున్నారు. కేంద్ర మంత్రి పదవిని అమరీందర్ సింగ్‌కు బీజేపీ ఆఫర్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story