సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం.. కన్వీనర్ శివారెడ్డి

by srinivas |
సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం.. కన్వీనర్ శివారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 17న తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహించబోతున్న సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లేఖ ఇస్తే.. ఆంక్షలకు సంబంధించి వివరణ ఇవ్వాలని ప్రత్యుత్తరం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో 42 కేసులు నమోదైనందున.. ఎందుకు అనుమతి ఇవ్వాలని ప్రశ్నించినట్లు శివారెడ్డి ప్రశ్నించారు.

పాదయాత్రలో నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని.. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లఘించలేదని వివరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టు ద్వారానే అనుమతి తెచ్చుకుంటామని శివారెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే సోమవారం నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం వెంగమాంబపురం నుంచి అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభమైంది. 36వ రోజైన సోమవారం 14 కిలోమీటర్ల పొడవున యాత్ర సాగనుంది. ఉదయం 9. 30 గంటలకు బాలాయపల్లి మండలం వెంగమాబపురం నుంచి ప్రారంభమైన యాత్ర అక్కసముద్రం, మాటుమడుగు, బంగారుపేట మీదుగా సాగనుంది. ఈరోజు యాత్ర నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో కొనసాగనుంది.

Next Story

Most Viewed