రెండో పెళ్లి చేసుకోలేదు: అమలాపాల్

by  |
రెండో పెళ్లి చేసుకోలేదు: అమలాపాల్
X

సినీ నటి అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందనీ, అందుకు సంబంధించి ఫొటోలు ఇవిగో అంటూ..నెట్‌లో, సామాజిక మాధ్యమాల్లో కొందరు వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ముంబయి సింగర్ భవీందర్ సింగ్‌ను పెళ్లాడిందని అందుకు సంబంధించిన ఫొటో కూడా పెట్టారు. అయితే, ఇవేవీ నిజం కాదని అమలా పాల్ స్పష్టం చేసింది.

తాజాగా ఓ తమిళ ఛానల్‌తో అమలా‌పాల్ ముచ్చటించింది. తన పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తాను రెండో పెళ్లి చేసుకోలేదని తెలిపింది. తాను భాగస్వామిగా ఉన్న ఓ సంస్థ కోసం చేసిన ఫొటో షూట్ ఫొటోలే నెట్‌లో వైరల్ అయ్యాయని చెప్పింది. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటానని తెలిపింది. తమిళ సినీ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లాడింది. అయితే, మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.

tags: marriage, actress amala paul, director al vijay

Advertisement

Next Story