జంతువులతో కరోనా రాదు : అమల

by Shyam |
జంతువులతో కరోనా రాదు : అమల
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనా దరిచేరకుండా కట్టడి చేస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా… పెంపుడు జంతువుల వల్ల కరోనా వ్యాపిస్తుందనే భ్రమతో వాటిని అసలు పట్టించుకోవడం లేదు మనుషులు. దీంతో కొన్ని చోట్ల పెట్స్ చనిపోతున్నాయి కూడా. అయితే అలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని చెబుతున్నారు బ్లూ క్రాస్ ప్రతినిధి అక్కినేని అమల. పెంపుడు జంతువులతో కరోనా వ్యాప్తి చెందుతుందనడంలో నిజం లేదన్నారు. కరోనా మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుందే తప్పా… జంతువుల నుంచి మనిషికి సోకదని స్పష్టం చేశారు. ఎక్కడా ఆధారాలు కూడా లేవన్నారు. ఎలాంటి భ్రమలు పెట్టుకోకుండా పెంపుడు జంతువులను దగ్గరకు తీసుకోవాలని కోరారు అమల. మూగజీవాలను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని… సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూనే పెంపుడు జంతువులను కాపాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఓపెన్ చేయబడే వెటర్నిటీ హాస్పిటల్స్ లిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Tags : Amala Akkineni, Pets, Care, CoronaVirus, Covid 19

Advertisement

Next Story

Most Viewed