ఆలూరి లలిత మృతిపై మావోయిస్టు పార్టీ ప్రకటన

by Shyam |
ఆలూరి లలిత మృతిపై మావోయిస్టు పార్టీ ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ సాహితీవేత్త ఆలూరి భుజంగరావు భార్య లలిత (76) గుండెపోటుతో చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ముగ్గురు కూతుళ్ళను విప్లవోద్యమంలోకి పంపిన ‘విప్లవాల అమ్మ’ లలిత పదేళ్ళుగా రహస్య జీవితం గడుపుతున్నారని, గుల్బర్గాలోని కుమారుడి ఇంట్లో ఉంటూ గుండెపోటుతో కన్నుమూశారని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలూరి లలిత మావోయిస్టు పార్టీకి విశిష్ట సేవలందించారని, వృద్ధాప్యంలోనూ పార్టీ అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తించారని కొనియాడారు. ఆలూరి భుజంగరావు సైతం 1985 మొదలు పదకొండేళ్ళ పాటు వరకు దండకారణ్య ఉద్యమానికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు.

ఆలూరి లలిత తన ముగ్గురు కూతుళ్లను విప్లవోద్యమంలోకి పంపించారని, కుమారుడ్ని వదలిపెట్టి దశాబ్ద కాలం పాటు రహస్య జీవితంలో ఉంటూ ప్రచురణ విభాగంలో పని చేశారని అభయ్ పేర్కొన్నారు. ప్రభాత్ పత్రికను ముద్రించి నగరాల నుంచి చాకచక్యంగా దండకారణ్యానికి చేరవేయడంలో ఆమె పోషించిన పాత్ర ప్రతిభావంతమైనదని గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed