ఆ పంటలతోనే ఎక్కువ లాభాలు.. వ్యవసాయ అధికారి

by Sridhar Babu |
corps
X

దిశ, శంషాబాద్ : ఆరుతడి పంటలతో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శంకరాపూర్ గ్రామంలో ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీతా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరికి బదులుగా కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేయాలన్నారు. ఆరుతడి పంటల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చని అన్నారు. దాంతో పాటుగా ఆరుతడి పంటలపై తగిన సలహాలు సూచనలు అందించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యాసంగి లో వరి ధాన్యం కొనదు కాబట్టి కొనుగోలు కేంద్రాలు ఈ యాసంగికి ఉండవు కాబట్టి ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story