- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
111 ఏళ్ల ‘అల్లూరి’అనుచరుడు కన్నుమూత
దిశ, ఏపీబ్యూరో : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు బీరు బోయిన బాలుదొర(111) ఆదివారం కన్నుమూశారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామం. బాలుదొర గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1924లో అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బాలుదొర బాలుడిగా ఉండేవారు.
ఎత్తైన కొండలపై ఉన్న అల్లూరికి, ఆయన ముఖ్య అనుచరులకు ఆహారం అందించినట్లు పలు సందర్భాల్లో గుర్తు చేసుకునే వారని స్థానికులు పేర్కొన్నారు. అల్లూరిని దగ్గరగా చూసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మ సుకృతమని, నాటి ఘటనలను బాలుదొర ఎంతో మందితో పంచుకునేవారు. ఆయన మరణవార్త గురించి తెలిసి చుట్టుపక్కల ప్రజలు నివాళులర్పించేందుకు కొండపల్లికి తరలివచ్చారు. బాలుదొర మరణానికి అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు సంతాపం తెలిపారు.