- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ తో 'అల్లు' వారబ్బాయి డేటింగ్… నిజమేనా?
దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమ అన్నాక రూమర్లు రావడం సహజమే. ఆ హీరో, ఈ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని, ఆ హీరోయిన్, ఈ హీరో వెనుక పడుతుందని పుకార్లు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పుకార్లు నిజం కూడా అవుతాయి. ఇప్పటీకే టాలీవుడ్ లో పలు జంటలు ఇలాగే డేటింగ్, ఔటింగ్ అంటూ కెమెరా కంటికి చిక్కి, రూమర్స్ లో పడి ఒకటైన సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా టాలీవుడ్ లో ఒక యువ హీరో డేటింగ్ విషయం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే.. ఇంకెవరు మన అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్.
‘గౌరవం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో ఇప్పటీవరకు ఒక భారీ హిట్ ని అందుకోలేదు అన్నది అందరికి తెలిసిన విషయమే. అన్న బన్నీ, నాన్న అల్లు అరవింద్ సహకారం ఉన్నప్పటికీ శిరీష్ ఇంకా విజయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ మధ్య కొంచెం సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ హీరో జిమ్ లో కసరత్తులు చేస్తూ బాడీ పెంచుతున్నాడు. మెగా ఫ్యామిలీ లో నిహారిక పెళ్లి తర్వాత శిరీష్ పెళ్లికొడుకవుతున్నాడు అంటూ వచ్చిన వార్తలు అప్పట్లో దుమారమే లేపాయి. ఇక తాజాగా అల్లు హీరో యంగ్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు అని టాలీవుడ్ టాక్. వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు. కానీ వీరి మధ్య స్నేహం మాత్రం బాగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ వార్తలకు బలం చేర్చినది మాత్రం శిరీష్ పోస్ట్ చేసిన ఒక వీడియో.. అను బర్త్ డే సందర్భంగా ఒక క్యూట్ వీడియో ను పోస్ట్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలిపాడు. దీంతో ఈ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది. అల్లు వారబ్బాయి యంగ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ రూమర్స్ పుట్టుకొచ్చేశాయి. అయితే ఒక వేళ శిరీష్ నెక్స్ట్ సినిమాలో అను హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి ఉండొచ్చు.. అందుకే అలా విష్ చేసి ఉంటాడు అని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ డేటింగ్ విషయంపై శిరీష్ నోరు తెరిస్తే తప్ప ఈ పుకార్లకు చెక్ పడదు. ఒక వేళ ఇదే నిజమైతే త్వరలోనే అల్లువారింట పెళ్లి భాజాలు మోగుతాయేమో చూడాలి. ఎలాగూ అల్లు అర్జున్ ది ప్రేమ వివాహమే కాబట్టి శిరీష్ విషయంలోనూ అరవింద్ సుముఖంగానే ఉంటారన్నది వాస్తవం. మరీ ఈ మ్యాటర్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.