- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అన్ని వర్గాలకు సముచిత స్థానం.. టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం’
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విద్వత్సభ ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన నవతివర్ష (90) శ్రీ శార్వరీ పంచాంగ ఆవిష్కరణోత్సవంలో ఇంద్రకరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ గాడిచెర్ల నాగేశ్వర రావు సిద్ధాంతి రచించిన నవతివర్ష (90) శ్రీ శార్వరి పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుల, మత ప్రాంతాలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పోరేషన్ల మాదిరిగానే రాష్ట్రంలోని బ్రాహ్మణ వర్గాల శ్రేయస్సు కోసం రూ.100 కోట్ల నిధితో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు.
తెలంగాణ ఎంతో మంది పండితులు, సిద్ధాంతులకు నిలయమన్నారు. విద్వత్సభ ఆద్వర్యంలో పండగలపై ఏకాభిప్రాయంతో ఒకే పంచాగాన్ని రూపొందించడం ప్రభుత్వానికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది జూలై 11, 12న జరిగే నాలుగో రాష్ట్ర స్థాయి జ్యోతిష్య మహాసభలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయసాకారాలు అందిస్తామని హామీనిచ్చారు. అలాగే, కరోనా వ్యాప్తిపై దేవదాయ అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించిన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ, కోశాధికారి మరుమాముల వెంకట రమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Tags: allola indrakaran reddy, sharvari panchanga, boggulakunta, trs