సెకండ్ వేవ్‌తో బీ కేర్ ఫుల్: ఇంద్రకరణ్ రెడ్డి

by Shyam |
సెకండ్ వేవ్‌తో బీ కేర్ ఫుల్: ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకొని నిబంధనలు పాటించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా మరోసారి ప్రభలుతున్న నేపథ్యంలో అరణ్య భవన్‌లోని ఆయన ఛాంబర్‌లో.. గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో అట‌వీ ఉద్యోగులు వైర‌స్ భారిన ప‌డ‌కుండా తీసు‌కుంటు‌న్న జాగ్రత్తలు, ఇప్పటివ‌ర‌కు ఎంత మంది ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు?, ఎంత‌మందికి కరోనా వైర‌స్ సోకింది?, ఎంత‌మంది అట‌వీ ఉద్యోగులు మ‌ర‌ణించారు? అని మంత్రి ఆరా తీశారు. శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాల‌ని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ‌ను మంత్రి ఆదేశించారు. గతేడాది నుంచి అట‌వీ శాఖలో 236 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన ప‌డ్డార‌ని, ఇప్పటి వ‌ర‌కు 11 మంది మ‌ర‌ణించారని పీసీసీఎఫ్ శోభ మంత్రికి తెలిపారు. దీంతో అట‌వీ ఉద్యోగులు, సిబ్బంది మ‌ర‌ణాల‌పై మంత్రి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story