- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
దిశ, న్యూస్‌బ్యూరో: జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ మీడియా అకాడమీ భవనానికి ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ భవనంలో జర్నలిస్టులకు శిక్షణా తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, వీడియో కాన్ఫరెన్స్ హాల్తో పాటు, ఆడిటోరియంను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ భవనం ద్వారా జర్నలిస్టులకు మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఆందోల్ ఎంఎల్ఎ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ మీడియా అకాడమీ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఇంజనీర్లకు సూచించారు. కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు నర్సింగరావు, దుర్గా ప్రసాద్, రాఘవేందర్, ఆర్కిటెక్చర్ రవి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్షులు ఇస్మాయిల్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు భాస్కర్ పాల్గొన్నారు.