- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి మద్దతుగా 18న నిరసన ప్రదర్శనలు
దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా ఈనెల 18న అన్ని మండల, బ్లాక్ స్థాయిలో మహిళలతో పెద్ద ఎత్తున సభలు, ప్రదర్శనలు నిర్వహించాలని అఖిల భారత రైతు సమన్వయ కేంద్రం పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని మహిళా సంఘాలు ఆదివారం సమావేశం అయ్యాయి. సమావేశానికి గంగాభవాని అధ్యక్షత వహించారు, భోగి పండుగ సందర్భంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చట్టాల ప్రతులను దహనం చేయాలని రమాదేవి సూచించారు.
14 ,15 తేదీల్లో రైతుల పోరాటం విజయం సాధించాలని, రైతుల విజయమే మహిళల విజయమని ప్రతి ఇంటి ముంగిటా ప్రతి వీధిలో రంగవల్లులు తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు. 16 ,17 తేదీల్లో మహిళా రాష్ట్ర నాయకత్వం గ్రామాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. 18న మండల కేంద్రాల్లోనూ, విజయవాడ నగరంలోని మహిళలతో ప్రత్యేకంగా సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. 26 రిపబ్లిక్ డే సందర్భంగా జరగనున్న ట్రాక్టర్ల రైతు కవాతులో పాల్గొనేందుకు 25న మహిళలు ట్రాక్టర్ల డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకోవాలని నిర్ణయించారు.