MX టకాటక్ ఆధ్వర్యంలో.. ఫస్ట్ ‘క్రియేటర్ ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’

by Shyam |
MX TakaTak India
X

దిశ, ఫీచర్స్: చాలామందిలో ప్రతిభకు కొదువ లేకున్నా, దాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి సరైన ప్లాట్‌ఫామ్ దొరకలేదని బాధపడుతుంటారు. కానీ ప్రస్తుత టెక్ ఎరాలో ఎంతోమంది ‘యూట్యూబర్స్‌, బ్లాగర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, టిక్‌టాకర్స్‌’గా సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం తమను సంతోషపెట్టే ఆడియన్స్‌ను సంపాదించుకోలేకపోతున్నారు, తమను ప్రోత్సహించే చీర్ లీడర్స్‌ను పొందలేకపోతున్నారు, తమ కంటెంట్‌తో లక్షలాది మందిని చేరుకోలేకపోతున్నారు. ఇలాంటి వారికోసమే ‘ఎక్స్ టకాటక్’ ఓ కొత్త కోర్సును తీసుకురాబోతుంది. కాగా యూనిక్ కంటెంట్ కలిగి ఉన్నప్పటికీ అనుచరులను పొందటానికి కష్టపడుతున్న వారికి, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు లేనివారికి ఈ కోర్సు ఉపయోగపడనుంది.

ఎంఎక్స్ టకాటక్, గ్లోబల్ ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్.. ‘నాస్ అకాడమీ’తో కలిసి మొట్టమొదటి ‘క్రియేటర్ ఫెలోషిప్’ శిక్షణా కార్యక్రమాన్ని తాజాగా ప్రకటించింది. ఇందులో భాగంగా 25 మంది ప్రతిభావంతులను ఎంపికచేసి, గొప్ప కథలు చెప్పే విధానంతో పాటు హై క్వాలిటీ కంటెంట్ అందివ్వడం ఎలా? అనే విషయాలను నేర్పించనుంది. స్కిప్టింగ్, షూటింగ్, ఎడిటింగ్, పబ్లిషింగ్, రెగ్యులర్ ప్రాజెక్ట్ ట్రైనింగ్, సోషల్ మీడియా పేజీల నిర్వహణపై గైడెన్స్.. ఇలా కంప్లీట్‌గా కంటెంట్ క్రియేషన్ టెక్నిక్స్‌లో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు నాస్ అకాడమీ మెంటార్స్ 1:1 సెషన్స్ అందిస్తారు.

ఎలా ఎన్‌రోల్ కావాలి?

మీరు చేయాల్సిందల్లా ఈ కోర్సులో చేరడానికి కారణాన్ని తెలుపుతూ వన్ మినట్ వీడియోను నిర్వాహకులకు సెండ్ చేయాలి. గత కంటెంట్ క్రియేషన్ ఎక్స్‌పీరియన్స్, MX టకాటక్ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో కూడా అందులో వివరించాలి. ప్యానెల్ మీ వీడియోను ఇష్టపడితే.. ఇండియాలోని తొలి ‘క్రియేటర్ ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రొగ్రామ్’ బ్యాచ్‌లో భాగమవుతారు.

Advertisement

Next Story