నెట్టింట ఆలియా.. అండర్‌వేర్ ఫొటోలు..‘రేటు’ ఎంతంటూ ట్రోల్స్

by Jakkula Samataha |   ( Updated:2021-02-19 02:09:26.0  )
నెట్టింట ఆలియా.. అండర్‌వేర్ ఫొటోలు..‘రేటు’ ఎంతంటూ ట్రోల్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్‌ సోషల్ మీడియా ట్రోల్స్‌తో నిరంతరం ఏడుస్తూనే ఉన్నానని తెలిపింది. లోదుస్తులతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయడంతో దారుణమైన వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. తను చాలా సున్నితమైన వ్యక్తినని, చిన్న ద్వేషాన్ని కూడా తట్టుకోలేననన్న ఆలియా.. సోషల్ మీడియా నెగెటివ్ కామెంట్స్ తనను చాలా ప్రభావితం చేశాయని చెప్పింది.

అండర్ వేర్‌తో ఫొటోలు పోస్ట్ చేసిన తనను భారతీయుడిగా సిగ్గుపడాలని ప్రజలు తిడుతున్నారని బాధపడిపోయింది. తనను వేశ్యగా అభివర్ణించారని, రేటు ఎంత అని అడుగుతున్నారని తెలిపింది. అత్యాచార బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని, చంపేస్తానని భయపెట్టారని వాపోయింది. తన కుటుంబం గురించి చాలా అసభ్యంగా మాట్లాడారన్న ఆలియా..ఇవన్నీ తట్టుకోలేక రోజూ ఏడుస్తూనే ఉండేదాన్నని చెప్పింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన తాను తర్వాత రియలైజ్ అయ్యానని తెలిపింది. అయినా ఫోన్‌ల వెనుక దాక్కుని చేసే వ్యక్తుల ట్రోల్స్‌తో బాధపడిపోవడం సరికాదనే నిర్ణయానికి వచ్చానని ..ఈ క్రమంలో సోషల్ మీడియాను పాజిటివ్ ప్లేస్‌గా మార్చుకునేందుకు గాను తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని బ్లాక్ చేశానని తెలిపింది.

Advertisement

Next Story