- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలీబాబా జాక్‌మాకు భారత్ కోర్టు సమన్లు
దిశ, వెబ్‌డెస్క్: కంపెనీ యాప్‌లోని డాక్యుమెంట్ల సెన్సార్‌షిప్, ఫేస్ వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు గాను, తనను అనవసరమైన పద్దతుల్లో ఉద్యొగం నుంచి తొలగించారని భారత్‌లో ఉన్న ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, కంపెనీలకు భారత్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల సరిహద్దు వివాదం కారణంగా భద్రత రీత్యా అలీబాబాకు చెందిన పలు యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధం విధించిన క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 29న అలీబాబాకు చెందిన జాక్ మా సహా కంపెనీకి చెందిన 12 మంది అధికారులు గురుగ్రాంలోని జిల్లా కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. చైనాకు చెందిన యాప్స్‌లకు ప్రతికూలంగా ఉన్న కంటెంట్‌ను కంపెనీ సెన్సార్ చేసిందని, అవి రాజకీయ గందరగోళానికి తావిచ్చేవిగా ఉన్నట్టు చైనాకు చెందిన యాప్ యూసీ బ్రౌజర్ వెబ్ మాజీ ఉద్యోగి పుష్పేంద్ర సింగ్ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వెల్లడించారు.
ఈ అంశంపై అడిగినందుకే తనను ఉద్యోగంలోంచి తొలగించారని సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఇచ్చిన సమన్లలో తమ స్పందనను లిఖితపూర్వకంగా చెప్పాలని అలీబాబా కంపెనీతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను న్యాయమూర్తి కోరారు. దీనిపై స్పందించిన యూసీ బ్రౌజర్ ఇండియా, సంస్థ భారత్‌లోని స్థానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది. ఈ వివాదంపై ఇప్పుడే ఏం చెప్పలేమని పేర్కొంది.