కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.. ఆలియాను వదులుకోలేకపోతున్న చరణ్

by Shyam |
కెమిస్ట్రీ వర్కౌట్ అయింది.. ఆలియాను వదులుకోలేకపోతున్న చరణ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆయనకు జోడీ సీతగా నటిస్తోంది ఆలియా. ఇప్పటికే రిలీజ్ అయిన తన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తెరపై వీరిద్దరి జోడి కూడా అమితంగా ఆకట్టుకోనుందట.

ఇద్దరి మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ కావడంతో చెర్రీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు కూడా తననే సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం. ప్రముఖ దర్శకులు శంకర్ – చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలోనూ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్‌లో ఆలియానే నటించనుందని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆలియాను చరణ్ రిఫర్ చేశాడని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్ కాగా.. ఒకేసారి ఐదు భాషల్లో తెరకెక్కుతున్న మూవీని 3డిలో చిత్రీకరించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story