టీఆర్ఎస్‌, బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

by Shyam |
Congress Leader Beerla Ilaiah
X

దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం నమిల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు గురువారం ఆలేరు కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారిని ఐలయ్య కండూవా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలరాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మన్నె రాంచందర్, మేడిశెట్టి సురేందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story