అల్‌ఖైదా సంచలన వ్యాఖ్యలు.. మన నెక్స్ట్ టార్గెట్ కాశ్మీర్ అంటూ

by Anukaran |   ( Updated:2021-09-01 05:04:22.0  )
అల్‌ఖైదా సంచలన వ్యాఖ్యలు.. మన నెక్స్ట్ టార్గెట్ కాశ్మీర్ అంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు ఎంతటి అరాచకాన్ని సృష్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆగస్టు 30 అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా చివరి విమానం టేకాఫ్ అవ్వడంతో తాలిబన్లు సంబురాలు చేసుకున్నారు. ఇక అమెరికా సేనలు ఆఫ్ఘన్‌ను విడిచి వెళ్లిన మరుసటి రోజే తాలిబన్లకు అల్‌ఖైదా శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్ర సంస్థల్లో అల్‌ఖైదా ఒకటి. ఒసామా బిన్ లాడెన్ ని అమెరికా యుద్ద వీరులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా సైన్యాన్ని తరిమికొట్టి ఆఫ్గనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అల్‌ఖైదా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.

“ఇస్లాం శత్రువుల నుంచి లెవాంట్‌, సోమాలియా, యెమెన్‌, కశ్మీర్‌తోపాటు ఇతర ముస్లింల భూభాగాలను విడిపించుకుందాం. ఓ అల్లా.. ప్రపంచంలోని ముస్లిం ఖైదీలందరికీ స్వేచ్ఛను ప్రసాదించు” అని ఆ ప్రకటనలో అల్‌ఖైదా తెలిపింది. అమెరికా సేనలు వెళ్లగానే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌కు పూర్తిగా ఆక్రమించుకొని, పూర్తి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. ఇకపోతే అసలు ఆఫ్ఘన్‌లో ఈ యుద్ధానికి కారణం ఈ అల్‌ఖైదానే అన్న విషయం తెలిసిందే. ట్విన్ టవర్స్ కూల్చిన కేసులో నిందితుడైన బిన్ లాడెన్ ని వెతుకుంటూ అమెరికా సైనికులు ఆఫ్ఘనిస్థాన్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వారు లాడెన్ కి ఆశ్రయమిచ్చిన తాలిబన్లను అధికారం నుంచి దింపి వారు హస్తగతం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరవాత అమెరికా తిరిగి వెళ్లిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకే వెళ్లిపోయింది.

అప్ఘాన్ సరిహద్దులో వేలమంది శరణార్థులు

Advertisement

Next Story