వలస కూలీల కడుపునింపుతున్న ‘అక్షయపాత్ర’

by Shyam |   ( Updated:2021-08-05 06:32:24.0  )
వలస కూలీల కడుపునింపుతున్న ‘అక్షయపాత్ర’
X

దిశ, చేవెళ్ల: వలస కూలీలకు ప్రతిరోజు ఒక పూట అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చిన అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు ఆదర్శనీయులని శంకర్‌పల్లి ఎంపీపీ ధర్మన్నోళ్ళ గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలో 500 మందికి ఒక పూట ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని గురువారం ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీడీవో సత్తయ్యతో కలిసి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వలస కూలీలకు ప్రతిరోజు మధ్యాహ్నం పూట భోజనం పెట్టేందుకు ముందుకు వచ్చిన అక్షయ పాత్రకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు, మోకిల, దొంతానపల్లి, ఇరుకుంట తండా, మహారాజ్‌పేట్, పిల్లిగుండ్ల గ్రామాల సర్పంచులు, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొని వలస కూలీలకు అన్నదానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed