చారిత్రక ఇతిహాసంపై కిలాడీ సినిమా

by Jakkula Samataha |
చారిత్రక ఇతిహాసంపై కిలాడీ సినిమా
X

దిశ, సినిమా : బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పృథ్విరాజ్’. చంద్రప్రకాష్ ద్వివేది డైరెక్ట్ చేస్తున్న మూవీలో అక్షయ్ సరసన విశ్వ సుందరి మానుషి చిల్లర్ నటిస్తోంది. మధ్యయుగానికి చెందిన గొప్ప సాహితీ ఇతిహాసం ‘పృథ్విరాజ రాసో’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. గ్రేట్ పోయెట్ చాంద్ బార్దయి రచించిన ఎపిక్ బుక్ ‘పృథ్విరాజ రాసో’పై రీసెర్చ్ చేసిన తర్వాతే వెండితెరపై తీసుకొస్తున్నట్లు డైరెక్టర్ చంద్రప్రకాష్ తెలిపారు.

ప్రజలను హింసించిన మహమ్మద్ ఘోర్‌కు వ్యతిరేకంగా రాజు పృథ్విరాజ్ చేసిన పోరాటాలను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. చారిత్రక పాత్రలను ప్రజల ముందుంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ద్వివేది వెల్లడించారు. కాగా పృథ్విరాజ్ భార్య సంయోగితగా మానుషి కనిపించనుంది. ఇక ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story