చీర.. ప్రపంచంలోనే బెస్ట్ ఔట్‌ఫిట్ : అక్షయ్

by Jakkula Samataha |   ( Updated:2020-10-24 07:13:27.0  )
చీర.. ప్రపంచంలోనే బెస్ట్ ఔట్‌ఫిట్ : అక్షయ్
X

దిశ, వెబ్‌డెస్క్ : అక్షయ్ ఓ సినిమా ఒప్పుకున్నాడంటే.. అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని అందరూ అనుకుంటారు. ఓ వైపు కామెడీ సినిమాలు చేస్తూనే మరోవైపు.. చాలెంజింగ్ రోల్స్ పోషిస్తున్నాడు. సామాజిక, దేశభక్తి నేపథ్యంలోనూ చిత్రాలు చేస్తూ.. తనకు తానే పోటీగా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మీబాంబ్ చిత్రంలో ట్రాన్స్‌జెండర్ పాత్రను పోషిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు అక్షయ్. ట్రైలర్‌లోనే తన నటన చూసి అంతా వావ్ అంటున్నారు. కాగా అక్షయ్ ఆ పాత్ర కోసం తాను పడ్డ కష్టాలు, అనుభవాలను తాజాగా ఓ ఇంటర్య్వూలో పంచుకున్నాడు.

‘చీర కట్టుకోవడం అత్యంత కష్టమైన కానీ, ప్రపంచంలోనే గ్రేస్‌ఫుల్ ఔట్‌ఫిట్ చీరే. షూటింగ్ టైమ్‌లో నా చీర ఊడిపోయేది. చీరతో డ్యాన్స్, ఫైటింగ్ చేయడం పక్కనపెడితే.. సరిగ్గా ముందుకు అడుగులు వేయలేం. షూటింగ్ బ్రేక్‌లో కాస్ట్యూమ్ డిజైనర్ ప్రతీసారి నా వద్దకు వచ్చి ప్లేట్స్, పల్లు సరిచేసి వెళ్లేవాడు. ఆయనకు ప్రత్యేక ధన్యావాదాలు. నిజంగా చీర కట్టుకునే ఆడవాళ్లందరినీ మెచ్చుకోవాలి. వారిని మీరు కూడా అభినందించాలంటే.. ఒక్కసారి మీరు కట్టుకుని చూస్తేనే ఎంత కష్టమో అర్థమవుతుంది. నా 30 ఏళ్ల కెరీర్‌లో ‘లక్ష్మి’ పాత్ర మోస్ట్ ఇన్సెంటివ్ రోల్. ఈ పాత్ర క్రెడిట్ మొత్తం రాఘవ లారెన్స్‌కే చెల్లుతుంది. ఈ పాత్ర ఎలా నడుస్తుంది, ఎలా డ్యాన్స్ చేస్తుందన్న విషయాలను లారెన్స్ చేసి చూపిస్తే.. నేను ఇమిటేట్ చేశాను అంతే’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు.

నవంబర్ 9న డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ‘లక్ష్మీబాంబ్’ విడుదల కాబోతుంది. అక్షయ్ జోడిగా కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం నుంచి విడుదలైన ‘బుర్జ్ ఖలీఫా’ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Advertisement

Next Story