రామాలయ నిర్మాణం మన బాధ్యత :అక్షయ్ కుమార్

by Shyam |
రామాలయ నిర్మాణం మన బాధ్యత :అక్షయ్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభం అయింది. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు కొందరు విరాళాలు అందించి ఈ మహాకార్యంలో భాగం కాగా, తన వంతు సహాయం అందించి ఈ పనిలో భాగస్వామిని అయ్యాను అని.. మీరు కూడా కావాలని కోరుతున్నానని ట్వీట్ చేశాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్న అక్షయ్.. ఇందుకు సహకరించడం మన వంతు బాధ్యత అని దేశ ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా రామ సేతు నిర్మాణంలో ఉడుత సహాయం గురించి ప్రస్తావించిన అక్షయ్.. మనం కూడా రామాలయ నిర్మాణానికి ఉడుత భక్తిగా సహాయం అందించాలని కోరారు. వానరుల మాదిరిగా పెద్ద మొత్తంలోనో లేక ఉడతల మాదిరిగా చిన్న మొత్తంలోనో మనకు తోచిన విధంగా సహాయం అందించి.. చరిత్రాత్మక కట్టడంలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. ఈ కట్టడం ద్వారా రాబోయే తరాలు శ్రీరాముడు తన జీవితం ద్వారా ఇచ్చిన సందేశాన్ని తెలుసుకుంటారని.. అలాంటి గొప్ప నడవడికను అలవరుచుకుంటారని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story